భారతదేశం, అక్టోబర్ 15 -- న్యూఢిల్లీ: టెట్రా ప్యాకెట్లు, ప్లాస్టిక్ సాషేలలో మద్యం విక్రయాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్ (పిల్) పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా తమ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఆర్. మహాదేవన్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ప్రతివాదుల కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్‌కు రెండు వారాల సమయం ఇచ్చిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

'కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకన్ డ్రైవింగ్' (CADD) అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎన్జీవో తరఫున సీనియర్ అడ్వకేట్ విపిన్ నా...