భారతదేశం, ఏప్రిల్ 22 -- దేశీయ ఐటీ రంగంలో కీలక సంస్థ అయిన టెక్ మహీంద్రా (Tech Mahindra) బుధవారం తన నాలుగో త్రైమాసిక (Q4FY26) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ అంచనాలను మించి రాణించి, తన లాభాల్లో ఏకంగా 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.1,356 కోట్లుగా నమోదైనట్లు సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.1,142 కోట్లుగా ఉండటం గమనార్హం.

కేవలం ఏడాది ప్రాతిపదికనే కాకుండా, క్రితం త్రైమాసికం (Q3FY26) తో పోల్చినా కంపెనీ లాభం 21 శాతం పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో టెక్ మహీంద్రా రూ.1,118 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం (Revenue) కూడా ఆకట్టుకుంది. గతేడాది క్యూ4లో రూ.13,384 కోట్లుగా ఉన్న ఆదాయం, ఈసారి 12.6 శాతం పెరిగి రూ.15,076 కోట్లకు చేర...