భారతదేశం, జూన్ 4 -- టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ సంస్కృతి, సాహిత్యం, భాషా వైభవాన్ని అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశమని కళాశాల యాజమాన్యం తెలిపింది.

బి.ఏ.(ఓ.ఎల్.) డిగ్రీ కోర్సులో తెలుగు, సంస్కృతం, హిందీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ విభాగాలలో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. అలాగే ప్రీ-డిగ్రీ (ఇంటర్‌మీడియట్‌కు సమానం) కోర్సులో సంస్కృతం, తెలుగు, హిందీ విభాగాలలో కూడా అడ్మిషన్లు జరుగనున్నాయి.

ప్రవేశం పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా ఉచిత హాస్టల్ సదుపాయం కల్పిస్తారు. అంతేకాదు ఉచిత భోజన వసతి కూడా అందుబాటులో ఉంటుంది. రెండేళ్ల ప్రీ-డిగ్రీ కోర్సులకు 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, ఎస్‌ఎస్‌సీ లేదా...