భారతదేశం, ఆగస్టు 24 -- భారత ఐటీ రంగానికి శుభవార్త. భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) యూరప్ మార్కెట్‌లో మరో భారీ డీల్‌తో సంచలనం సృష్టించింది. జర్మనీకి చెందిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ 'పోర్షే ఎజీ' (Porsche AG) ఐటీ విభాగమైన ఎంహెచ్‌పీ (MHP)ని $373 మిలియన్లకు (సుమారు రూ. 3,100 కోట్లకు పైగా) కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొనుగోలుకు ప్రతిఫలంగా పోర్షే సంస్థ టీసీఎస్‌కు $1.45 బిలియన్ల (ఐదేళ్ల కాలపరిమితితో) ఐటీ ఆధునికీకరణ కాంట్రాక్టును అందించింది.

ఈ ఒప్పందం ద్వారా టీసీఎస్‌కు ఏటా సగటున $290 మిలియన్ల ఆదాయం సమకూరనుంది. పోర్షే సంస్థ ఇంజనీరింగ్, తయారీ, ఆపరేషన్స్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ విభాగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను అనుసంధానించడంతో పాటు ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సేవలను టీసీఎస్ అందించను...