భారతదేశం, జూన్ 2 -- విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే సంకల్పంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యాసంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. అలిపిరిలోని ఎస్వీబీసీ కార్యాలయం నుండి టీటీడీ డీఈవో వెంకటసునీల్‌తో కలిసి కళాశాలల ప్రిన్సిపల్స్‌, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో డాక్టర్‌ ఎ.శరత్‌ మాట్లాడుతూ.. ఆలయాల నిర్వహణతోపాటు విద్యా రంగానికీ సమాన ప్రాధాన్యతనిస్తూ టీటీడీ ఏడు దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. తిరుపతితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలను విజయవంతంగా నిర్వహిస్...