టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు, గోశాల ఆధునికీకరణ - తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం
భారతదేశం, జూన్ 28 -- Anant Ambani donation to TTD : ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) భారీ విరాళాలు ప్రకటించారు. శ్రీవారి భక్తులకు సౌకర్యవంతమైన, కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించడంతో పాటు ఆధ్యాత్మిక సేవల విస్తరణకు అంబానీ కుటుంబం మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది.
అనంత్ అంబానీ ఇవాళ వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అంతకముందు తిరుమలకు చేరుకున్న అనంత్ అంబానీకి టీటీడీ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఆలయ నిబంధనల ప్రకారం దర్శన ఏర్పాట్లు చేశారు.
సుప్రభాత సేవ అనంతరం అనంత్ అంబానీ ఆలయంలోని మూలవిరాట్టును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.