భారతదేశం, ఆగస్టు 4 -- Telangana ICET Counselling 2026 : రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. టీజీ ఐసెట్ - 2026 కౌన్సెలింగ్ ప్రక్రియలో అత్యంత కీలకమైన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.

ఇప్పటికే కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో. అధికారులు తాజాగా వెబ్ ఆప్షన్ల లింక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 8వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

విడుదల చేసిన ప్రవేశాల షెడ్యూల్ ప్రకారం.. ప్రాథమికంగా నమోదు చేసుకున్న విద్యార్థులకు ఆగస్టు 5వ తేదీ వరకు నిర్దేశిత హెల్ప్‌లైన్ కేంద్రాల్లోధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. ఈ సర్...