భారతదేశం, మే 26 -- రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబాలకు యూనియన్ బ్యాంక్ సహకారంతో టీజీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. వివిధ సమయాలలో విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన ఇద్దరు డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. పికెట్, పరిగి డిపోలకు చెందిన డ్రైవర్లు సుధాకర్, శ్రీనివాసరెడ్డిలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత డ్రైవర్ల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ ఆపద సమయంలో యూనియన్ బ్యాంక్ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాలకు ఉపయోగపడింది. ఆర్థిక ప్రయోజనంతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండటంతో ఉచిత ప్రమాద బీమా పథకం వర్తించింది. సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూనియన్ బ్యాంక్ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నా...