భారతదేశం, ఏప్రిల్ 21 -- జేఈఈ మెయిన్‌-2 ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశంలో 26 మంది విద్యార్థులు వంద పర్సంటైల్‌ సాధించగా అందులో ఏకంగా పది మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందినవారే ఉన్నారు.

తెలంగాణ నుంచి మంథా శివ కామేష్, దోర్నాల భవితేష్ రెడ్డి, సాయి రిత్విక్ రెడ్డి, వివాన్ శరద్ మహేశ్వరి, రిషి ప్రేమ్‌నాథ్ ఈ ఐదుగురు టాపర్లుగా నిలిచారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జొన్నల రోషన్‌ మణిదీ్‌పరెడ్డి, నరేంద్రబాబుగారి మహిత్‌, తుంగా దుర్గా సుప్రభాత్‌, పసల మోహిత్‌, బిజ్జం వెంకట చంద్రశేఖర్‌రెడ్డి 100 పర్సంటైల్ సాధించినవారిలో ఉన్నారు.

గతేడాదితో పోలీస్తే.. ఈసారి తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITలు, ఇతర అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ ఉపయోగపడుత...