టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ Q1 ఫలితాలు: నికర లాభం 83% జంప్
భారతదేశం, ఆగస్టు 12 -- టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ 'టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్' ఆగస్టు 12న మార్కెట్ ముగిసిన తర్వాత తొలి త్రైమాసిక (Q1) ఫలితాలను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 1,397 కోట్ల లాభాన్ని నమోదు చేయగా, ఈసారి అది రూ. 2,560 కోట్లకు ఎగబాకింది. గతేడాది మార్చి త్రైమాసికంలో నమోదైన రూ. 1,793 కోట్లతో పోల్చినా లాభాల్లో మంచి వృద్ధి కనిపించింది.
కార్యాచరణ ఆదాయం: గత ఏడాది క్యూ1లో రూ. 17,192 కోట్లుగా ఉన్న ఆదాయం, ఈ ఏడాది జూన్ త్రైమాసికానికి దాదాపు 20% పెరిగి రూ. 20,576 కోట్లకు చేరింది.
ఎబిటా (EBITDA): నిర్వహణ లాభం (EBITDA) 57.6% పెరిగి రూ. 3,272 కోట్లకు చేరగా, ఎబిటా మార్జిన్ 15.83%గా నమోదైంది. కంపెనీ ఎబిటా మార్జిన్ వరుసగా 12వ త్రైమాసికంలోనూ రెండంకెల స్థాయిలో కొనసాగడం గమనార్హం....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.