భారతదేశం, సెప్టెంబర్ 27 -- ఈ ఏడాది తెలంగాణలో నైరుతి రుతుపవనాల సీజన్ లోటు వర్షపాతంతో ముగిసింది. ఎందుకంటే నైరుతి రుతుపవన వర్షాలు ముగిశాయి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 27 వరకు సాధారణంగా నమోదు కావాల్సిన 726.7 మిమీ వర్షపాతానికి గాను కేవలం 615.3 మిమీ మాత్రమే నమోదైంది. దీంతో రాష్ట్రంలో సగటున 15 శాతం వర్షపాతం తగ్గింది. రాబోయే రెండు వారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్ జూన్‌లో ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుంది. అయితే ఈ నాలుగు నెలల కాలంలో ఏ ఒక్క నెలలోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాలేదు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరుసగా అన్ని నెలల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ఎల్ నినో పరిస్థితుల వల్లే రుతుపవనాలు బలహీనపడ్డాయని వాతా...