భారతదేశం, జూన్ 8 -- న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జోసా (JoSAA) కౌన్సెలింగ్ 2026 ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా మొదటి మాక్ సీట్ అలొకేషన్ (First Mock Seat Allocation) జాబితాను అథారిటీ అధికారికంగా విడుదల చేసింది. కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆప్షన్లను పూరించిన అభ్యర్థులు జోసా అధికారిక వెబ్‌సైట్ సందర్శించి ఈ జాబితాను తనిఖీ చేసుకోవచ్చు.

అభ్యర్థులు జూన్ 7, 2026 రాత్రి 8 ంటల వరకు నమోదు చేసిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఈ మొదటి మాక్ సీట్ అలాట్‌మెంట్ జాబితాను రూపొందించారు. విద్యార్థులు తాము ఎంచుకున్న ఆప్షన్లకు ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందో ముందే ఒక అంచనాకు రావడానికి ఈ మాక్ అలాట్‌మెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

అభ్యర్థులు కింద పేర్కొన్న సాధారణ దశలను అనుసరించి తమ తాత్కాల...