జోగులాంబ గద్వాలలో విషాదం - క్లాస్ రూమ్‌లో అవమానించిన లెక్చరర్..! విద్యార్థి సూసైడ్
భారతదేశం, జూలై 30 -- జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదకర సంఘటన వెలుగుచూసింది. కళాశాల అధ్యాపకురాలు తోటి విద్యార్థుల ముందే తనను తీవ్రంగా అవమానించి, చెంపదెబ్బ కొట్టారనే తీవ్ర మనస్తాపంతో ఓ ఇంటర్మీడియట్ ద్వితియ సంవత్సరం విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడమే కాకుండా విద్యార్థి కుటుంబంలో తీవ్ర శోకాన్ని నింపింది.
గద్వాల మండలం కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి.. ఇంట్లో తల్లిదండ్రులు, సోదరుడు బయటకు వెళ్లిన సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత లెక్చరర్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేసినట్లు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.