భారతదేశం, ఫిబ్రవరి 16 -- బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ జైలు నుంచి విడుదలయ్యారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చొరవ తీసుకుని కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ బకాయిలను తీర్చారని, అందుకే రాజ్‌పాల్ బయటకు వచ్చారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

అయితే, ఈ వార్తలపై రాజ్‌పాల్ యాదవ్ భార్య రాధ యాదవ్ ఎట్టకేలకు స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. రాజ్‌పాల్ యాదవ్ విడుదలపై వస్తున్న పుకార్లను ఆయన భార్య రాధ యాదవ్ ఖండించారు.

"ప్రస్తుతానికి ఆయన (రాజ్‌పాల్ యాదవ్) తీహార్ జైలులోనే ఉన్నారు. విడుదలయ్యారన్న వార్తల్లో వాస్తవం లేదు. బెయిల్ పిటిషన్‌పై సోమవారం (ఫిబ్రవరి 16) విచారణ జరగనుంది" అని రాధ యాదవ్ బాంబే టైమ్స్‌తో పేర్కొన్నారు. జైలులో ఆయన ఆరోగ్యం బాగుందని, ఈ కష్ట సమయంలో సినీ పరిశ...