భారతదేశం, సెప్టెంబర్ 1 -- దేశంలో అత్యంత కఠినమైన పోటీ పరీక్షల్లో ఒకటైన జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) పరీక్షా శైలి మారబోతోంది. కేవలం బట్టీ పద్దతులు, కోచింగ్ సెంటర్ల ట్రిక్కుల ఆధారంగా కాకుండా, విద్యార్థులలోని సృజనాత్మకత, ఆలోచనా శక్తిని (Critical Thinking) సరిగ్గా అంచనా వేసేందుకు ఐఐటీలు సరికొత్త వ్యూహాన్ని రచిస్తున్నాయి. ఇందులో భాగంగా 'అడాప్టివ్ టెస్టింగ్' (Adaptive Testing) అనే అధునాతన పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయోగాలు ప్రారంభించాయి.

ప్రస్తుతం వివిధ ఐఐటీల్లో మొదటి సంవత్సరం చదువుతున్న సుమారు 4,000 మంది విద్యార్థులపై ఈ అడాప్టివ్ టెస్టింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా (Pilot Test) పరీక్షించారు. విద్యార్థుల నుంచి సేకరించిన సమాచారాన్ని (Data) విశ్లేషిస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ నేతృత్వంలో ఈ అధ్యయనం...