భారతదేశం, జూన్ 17 -- ఆంధ్రప్రదేశ్‌ వేదికగా గ్రామీణ భారతం మరో కీలక అడుగు వేయబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వికసిత్ భారత్ - రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్' (VB-G RAM G) పథకాన్ని వచ్చే జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ పథకానికి సంబంధించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ఢిల్లీలో సమావేశమై ఈ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు.

ఈ ప్రారంభోత్సవ వేదికపై ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను చాటుకోనుంది. రాష్ట్రంలోని మోడల్ పంచాయతీలు, సున్నా వ్యర్థ పంచాయతీల (Zero-waste gram panchayats) పనితీరును ప్రదర్శించనున్నారు. స...