భారతదేశం, సెప్టెంబర్ 20 -- వనపర్తి జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలువ కింద సాగు చేసిన పంటలు తీవ్రంగా ఎండిపోతుండటంతో.. నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయకట్టు రైతులు ఆందోళన బాట పట్టారు. పరిస్థితి చేయిదాటిపోకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు ప్రాజెక్టు ప్రాంగణంలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు మొత్తం పోలీసుల కట్టుదిట్టమైన పహారాలోకి వెళ్లిపోయింది.

ఎగువ నుంచి తగినంత నీటి ప్రవాహం లేక, తీవ్ర నిరీక్షణ మధ్య పంటలు ఎండిపోతుండటంతో ఆవేదన చెందిన ఆయకట్టు రైతులు శనివారం రోజు స్వయంగా ముందుకు వచ్చి జూరాల ఎడమ కాలువ గేట్లను ఎత్తారు. కాలువలోకి నీటిని విడుదల చేసుకుని తమ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే.. పరిస్థితులను గమనించిన నీటిపారుదల శాఖ అధికారులు అర్ధరాత్రి సమయంలో గుట్టుచప...