భారతదేశం, జూన్ 29 -- తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో జూన్ 30వ తేదీన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. ఐఎండీ తాజా అంచనాల ప్రకారం.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలలో నీరు చేరే ప్రమాదం ఉంది. కాబట్టి స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో పిడుగులు, గాలులతో కూడిన వర్షం కూడా కురుస్తుందని అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల కారణంగా సాగునీటి పారదల, రవాణా, విద్యుత్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నివసించే వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవ...