భారతదేశం, జూన్ 6 -- గత కొంతకాలంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాల కోసం ఎదురుచూస్తున్న వారికి అప్డేట్. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న జ్యేష్ట అధిక మాసం జూన్ 15వ తేదీతో ముగియనుంది. జూన్ 16 నుండి నిజ జ్యేష్ట మాసం (శుద్ధ మాసం) ప్రారంభం కానుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్లీ శుభముహూర్తాల జాతర మొదలుకానుంది.

అధిక మాసం కారణంగా గత నెల రోజులుగా నిలిచిపోయిన శుభకార్యాల సందడి, జూన్ మూడో వారం నుండి తెలుగు రాష్ట్రాల ఇళ్లలో మళ్లీ ప్రారంభం కాబోతోంది. శాస్త్రాల ప్రకారం అధిక మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. సాధారణంగా పెద్దలు శూన్యాలు అంటుంటారు. ఈ సమయంలో విశ్వంలో శుభ శక్తుల ప్రభావం తక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ కాలంలో పెళ్లిళ్లు, శంకుస్థాపనలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వంటి శుభకార్యాలను నిషిద్ధంగా భా...