భారతదేశం, జూలై 4 -- తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ముహూర్తం ఖరారైంది. జులై 6వ తేదీన జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకుల సంస్థ సెక్రటరీ కంభంపాటి శారద ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గురుకుల కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆర్‌జేసీసీఈటీ-2026 ప్రవేశ పరీక్ష ఆధారంగా ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. అయితే రెండు దశల అడ్మిషన్లు ముగిసినప్పటికీ కొన్ని కళాశాలల్లో ఇంకా కొన్ని ఇంటర్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ నేరుగా సీట్లను భర్తీ చేసేందుకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలన...