భారతదేశం, జూలై 10 -- దక్షిణ భారతదేశంలోని ప్రముఖమైన ఆలయాల సందర్శన వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్. ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని రన్ చేస్తోంది. ఆసక్తి ఉన్నవారు బడ్జెట్ ధరలోనే పుణ్యక్షేత్రాలు దర్శించుకుని రావొచ్చు. దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం పేరుతో ఈ టూర్ ఐఆర్‌సీటీసీ ఆపరేట్ చేస్తోంది. తక్కువ ఖర్చులోనే ప్రముఖ ఆలయాలను సందర్శించి రావొచ్చు.

8 రాత్రులు, 9 రోజుల టూర్ ఇది. జులై 20వ తేదీన ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి జంక్షన్, ఒంగోలు, నెల్లూరు, గుడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్‌ దగ్గర రైలు ఎక్కవచ్చు. ఈ టూర్‌లో భాగంగా అరుణాచలం దర్శనం కూడా ఉంటుంది.

తిరువణ్ణామలై (అరుణాచలం): ప్రసిద్ధ అరుణాచలేశ్వర ఆలయ దర్శనం.

చిదంబరం: అద్భుతమైన నటరాజ స్వామి దేవాలయం.

తిరుచ్చి ...