భారతదేశం, జూలై 4 -- హిందూ సంప్రదాయంలో ప్రతి నెలా ఒక విశిష్టత ఉంటుంది. అయితే ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ఈ మాసంలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాల వంటి శుభకార్యాలు నిర్వహించకపోయినా.. దైవారాధనకు పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఆకాశంలో జరిగే అద్భుత ఖగోళ మార్పులకు, ఆధ్యాత్మిక సాధనలకు ఈ మాసం వేదికగా నిలుస్తుంది. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరించడం వల్లే ఈ మాసానికి ఆషాఢం అనే పేరు వచ్చింది. జులై నెలలో గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు, కొత్త పనులు మెుదలుపెట్టేందుకు జులై 1, 2, 3, 4, 5, 6 తేదీలు అత్యంత అనుకూలమైన రోజులు.

ఖగోళ శాస్త్రం ప్రకారం జూలై నెలలో ఒక పెద్ద మార్పు చోటుచేసుకోబోతోంది. జూలై 17వ తేదీ ఉదయం 11:04 గంటలకు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే 'కర్కాటక సంక్రమణం' లేద...