జీహెచ్ఎంసీ పార్కుల ఎంట్రీ ఫీజు డబుల్.. పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.5!
భారతదేశం, నవంబర్ 17 -- హైదరాబాద్ నగరంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు సేదతీరాలనుకునే హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ ధరలను పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్కుల ప్రవేశ రుసుములను భారీగా పెంచుతూ బల్దియా స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన కొత్త ధరల ప్రకారం.. పెద్దలకు ప్రవేశ రుసుము డబుల్ కాగా.. పిల్లల టికెట్ ధరను కూడా పెంచారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించిన తాజా ప్రతిపాదనల ప్రకారం పార్కుల ప్రవేశ ధరలు ఈ విధంగా మారనున్నాయి. పెద్దలకు ఇప్పటివరకు రూ.10గా ఉన్న టికెట్ ధరను రూ.20కి పెంచారు. అంటే 12 సంవత్సరాలు దాటిన పిల్లలు, పెద్దలందరూ ఇకపై రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.
5 నుంచి 12 ఏళ్లలోపు వారికి గతంలో రూ.2గా ఉన్న ఎంట్రీ ఫీజును రూ.5కు సవరించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు యథావిధిగా ఉచిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.