భారతదేశం, అక్టోబర్ 8 -- జీఎస్టీ చెల్లింపుదారులు, చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఢిల్లీ వేదికగా నిర్వహించిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను పరిపాలనను మరింత సులభతరం చేస్తూ, వ్యాపార ప్రాసెస్‌లను సులభతరం (Ease of Doing Business) చేసే దిశగా అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పన్ను అధికారులకు ఉన్న కొన్ని అరెస్ట్ అధికారాలను రద్దు చేయడంతో పాటు, ప్రాసిక్యూషన్ పరిమితిని భారీగా పెంచారు.

ఇప్పటివరకు రూ.1 కోటి దాటితే ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. అయితే వ్యాపారులపై వేధింపులు తగ్గించేందుకు ఈ పరిమితిని ఏకంగా రూ.5 కోట్లకు పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల కేసులలో పన్ను అధికారులకు ఉన్న అరెస్ట్ చేసే అధికారాలను పూర్తి...