భారతదేశం, అక్టోబర్ 28 -- జియో ఐపీఓ లిస్టింగ్ వేడుక అత్యంత భావోద్వేగభరిత వాతావరణంలో జరిగింది. రిలయన్స్ పరిశ్రమల వ్యవస్థాపకుడు, దివంగత ధీరూభాయ్ అంబానీ శ్రమతో కూడిన ప్రయాణాన్ని ఆయన మనవడు అనంత్ అంబానీ వేదికపై ఆవిష్కరించారు. తండ్రి ఆశయాలను, పడిన కష్టాలను తన కొడుకు నోటి వెంట వింటున్న సమయంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్లంబడి నీళ్లు తిరిగాయి.

గుజరాత్‌లోని చిన్న గ్రామమైన చోర్వాడ్‌లోని ఒక సాధారణ ఇంట్లో ధీరూభాయ్ కన్న కలలను అనంత్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఏడెన్ (యెమెన్)లోని పెట్రోల్ పంపులో ఒక సాధారణ ఉద్యోగిగా ధీరూభాయ్ పనిచేసిన రోజులను గుర్తుచేశారు.

"ఓ సామాన్య భారతీయుడు కూడా అసాధారణ కలలు కనవచ్చని ఆయన నిరూపించారు" అని ఆనంత్ పేర్కొన్నారు. ఆ రోజుల్లో ఆయన వద్ద డబ్బుగానీ, ఎటువంటి రాజకీయ వ్యాపార సంబంధాలు గానీ లే...