భారతదేశం, నవంబర్ 28 -- Hyderabad Kollam Festival Special Trains : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు, సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు ప్రయాణించే వారి సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, కొల్లాం మధ్య ఎనిమిది ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 2027లో ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్ నుంచి బయలుదేరే 07193 రైలు సికింద్రాబాద్, చర్లపల్లి మీదుగా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల వద్ద ఆగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో హాల్ట్ ఉంటుంది.

తిరుగు ప్రయాణంలో 07194 కొల్లాం - హైదరాబాద్ రైలు తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చ...