భారతదేశం, నవంబర్ 25 -- క్యూర్, ప్యూర్ ప్రాంతాల్లో మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖల పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా పనుల పురోగతిని తెలుసుకున్న ముఖ్యమంత్రి.. ప్రాజెక్టులపై అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షించారు. మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతిపై ఆరా తీశారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-1లో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కి.మీ. ప్రాంతాన్ని జోన్-1 ఏ గా, ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ ప్రాంతాన్ని జోన్-1 బీ గా విభజించి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 2027 లో ఫేజ్-1 పనులు మొ...