భారతదేశం, నవంబర్ 20 -- ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల రాజకీయాల్లో కీలక ఘట్టానికి తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల ఎన్నికల ప్రక్రియ శుక్రవారంతో విజయవంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించి 27 జడ్పీ పీఠాలను కైవసం చేసుకోగా, ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైఎస్సార్‌సీపీ తన పట్టును నిలుపుకొంది. కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం, పాలకమండళ్ల ఎన్నికను పూర్తి చేసి విజేతల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా వెల్లడించింది.

రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లా పరిషత్‌లలో 27 స్థానాలను కూటమి పార్టీలు సొంతం చేసుకోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా కొత్త పాలకమండళ్లు కొలువుదీరాయి. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన సీట్ల...