భారతదేశం, ఆగస్టు 7 -- శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశం నిర్వహించారు. టీటీడీ జేఈవో డాక్టర్ ఏ.శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి వివిధ శాఖల ఏర్పాట్లపై వెంకయ్య చౌదరి సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచాలని సూచించారు. వాహనాల పార్కింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే పార్కింగ్ స్థలాలను క...