భారతదేశం, మార్చి 4 -- నేడు 'ప్రపంచ ఊబకాయం దినోత్సవం' (మార్చి 4, 2026). ఈ సందర్భంగా విడుదలైన ఒక నివేదిక భారత ప్రజారోగ్య భవిష్యత్తుపై ఆందోళనకర విషయాలను వెల్లడించింది. వరల్డ్ ఒబిసిటీ ఫెడరేషన్ విడుదల చేసిన 'వరల్డ్ ఒబిసిటీ అట్లాస్ 2026' ప్రకారం.. బాల్య ఊబకాయం (Childhood Obesity) కేసుల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. మనకంటే ముందు చైనా మాత్రమే ఉంది.
కేవలం సంఖ్య మాత్రమే కాదు, ఈ సమస్య పెరుగుతున్న వేగం కూడా వణుకు పుట్టిస్తోంది. భారత్లో బాల్య ఊబకాయం రేటు ఏటా సగటున 5 శాతం చొప్పున పెరుగుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న ట్రెండ్లలో ఒకటి కావడం గమనార్హం.
2025 నాటి లెక్కల ప్రకారం, భారతదేశంలో 5 నుండి 19 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు సుమారు 4.1 కోట్ల మందికి పైగా అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనిని వయసుల వారీగా విభ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.