చేర్యాలలో రాజకీయ రగడ.. పల్లా, చామల మధ్య తీవ్ర వాగ్వాదం
భారతదేశం, నవంబర్ 18 -- సిద్దిపేట: పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం కాస్తా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ రగడకు వేదికైంది. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని రేణుకా గార్డెన్స్‌లో మంగళవారం (నవంబర్ 18న) నిర్వహించిన పింఛన్ ప్రొసీడింగ్స్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.
సంక్షేమ పథకాల పంపిణీ వేదికలపై అధికార, విపక్ష ప్రజాప్రతినిధులు ఎదురుపడినప్పుడు రాజకీయ విమర్శలు తలెత్తడం తెలంగాణలో తరచూ కనిపిస్తోంది. అయితే చేర్యాల సభలో ఇరువురు నేతలు నేరుగా సవాళ్లు విసురుకోవడంతో సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా వేడెక్కింది.
ఈ కార్యక్రమం జరుగుతుండగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గత ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.