భారతదేశం, అక్టోబర్ 6 -- దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ అక్రమ మార్గంలో దేశంలోకి చైనా బాణాసంచాను తరలించేందుకు యత్నించిన స్మగ్లర్ల కుట్రను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), హైదరాబాద్ అధికారులు భగ్నం చేశారు. చైనా నుంచి అక్రమంగా భారీ ఎత్తున విదేశీ బాణాసంచాను దిగుమతి చేసుకుంటున్నారనే ఖచ్చితమైన నిఘా సమాచారంతో.ఈ తతంగంపై నిఘా పెట్టింది.

కాగితాలు, స్టేషనరీ వస్తువులు, మెడికల్ గ్లోవ్స్, ప్లాస్టిక్ క్లిప్‌లు, హెయిర్ బ్యాండ్‌లు, స్టోరేజ్ వార్డ్‌‌రోబ్‌లు, షూ ర్యాక్‌లు తదితర గృహోపకరణాల పేరిట చైనా నుంచి షిప్పింగ్ కంటెయినర్లలో విదేశీ బాణాసంచాను నింపి రవాణా చేస్తున్నట్లు డిఆర్‌ఐ అధికారులు పసిగట్టారు. ఈ సమాచారంతో పక్కా ప్రణాళిక ప్రకారం సమన్వయంతో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పద కంటెయినర్లను క్షుణ్ణంగా సోదాలు చేశారు.

కంటెయినర్లలో పైన ప్రకటిం...