చుక్కలు చూపిస్తున్న సూరీడు.. 19 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు
భారతదేశం, మే 21 -- తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా ముదురుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏకంగా 19 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటగా, 82 ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచాయి.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (TSDPS) అధికారిక గణాంకాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఉత్తర తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45.8 నుండి 46 డిగ్రీల వరకు నమోదవగా, మిగిలిన జిల్లాల్లో 41 నుండి 45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లోనూ 41 డిగ్రీల నుండి 42.4 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండ తీవ్రత కొనసాగింది.
ముఖ్యంగా జనగామ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యంత తీవ్రమైన ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.