భారతదేశం, సెప్టెంబర్ 8 -- మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత సుస్మిత కొణిదెలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి (ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడి) ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేశారు.

ఈ నియామకంతో సుస్మిత కొణిదెల ఇంద్రకీలాద్రి ఆలయానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా వ్యవహారాల్లో భాగస్వామ్యం కానున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి నిత్యం వేలాది మంది, దసరా నవరాత్రుల సమయంలో లక్షలాది మంది భక్తులు దేశ నలుమూలల నుండి వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు కల్పించే మౌలిక వసతులు, దర్శన విధానాలు, సేవలు, ప్రాంగణ...