భారతదేశం, నవంబర్ 17 -- చిన్న పొలాలు, ఇరుకైన దారుల కారణంగా భారీ హార్వెస్టర్లను వినియోగించలేక ఇబ్బంది పడుతున్న రైతుల కోసం మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త పరిష్కారాన్ని తీసుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ సంస్థ అయిన మహీంద్రా, మంగళవారం (నవంబర్ 17, 2026) 50 హెచ్‌పీ సామర్థ్యంతో కూడిన 'మహీంద్రా హార్వెస్ట్ యువ' (Mahindra Harvest Yuva) సెల్ఫ్-ప్రొపెల్డ్ కాంపాక్ట్ హార్వెస్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. సన్న, చిన్నకారు రైతులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అద్దెకు యంత్రాలు నడిపే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.

సాధారణంగా మార్కెట్లో లభించే పెద్ద సెల్ఫ్-ప్రొపెల్డ్ హార్వెస్టర్లతో పోలిస్తే, 'మహీంద్రా హార్వెస్ట్ యువ' ధర 25 శాతం తక్కువగా ఉంది. తక్కువ బరువు, 4-వీల్ డ్రైవ్ (4WD) డిజైన్‌తో రూపొందించిన ఈ యంత్రం వరి, గోధుమ, సోయాబీన్, మొ...