భారతదేశం, నవంబర్ 22 -- హైదరాబాద్ - చెన్నై నగరాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు అత్యంత కీలకమైన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (Charminar Express) విషయంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక ప్రకటన విడుదల చేసింది. స్టేషన్ పునరాభివృద్ధి పనుల కారణంగా గత కొంతకాలంగా చెన్నై బీచ్ స్టేషన్ వరకే పరిమితమైన ఈ రైలు సర్వీసులను, మళ్లీ దాని అసలు టెర్మినల్ అయిన తాంబరం స్టేషన్ వరకు పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.

దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ మార్పులు వెంటనే అమల్లోకి రానున్నాయి.

రైలు నంబర్ 12760 (హైదరాబాద్ - తాంబరం చార్మినార్ ఎక్స్‌ప్రెస్) నవంబర్ 22, 2026 నుంచి ఈ రైలు చెన్నై బీచ్‌కు బదులుగా నేరుగా తాంబరం స్టేషన్ వరకు వెళ్లి అక్కడ ప్రయాణాన్ని ముగిస్తుంది.

రైలు నంబర్ 12759 (తాంబరం -...