భారతదేశం, మార్చి 16 -- రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి - షాలిమార్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు కొత్తగా మరో స్టాపేజీ ఉండనుంది. ఇకపై ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ఉన్న బస్తా రైల్వే స్టేషన్ లో కూడా ఆగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.

చర్లప్లలి - షాలిమార్ - చర్లపల్లి మధ్య నడిచే ( ట్రైన్ నెంబర్18046/45) ట్రైన్ బస్తా రైల్వే స్టేషన్ లో ఆగనుంది. ఈ నిర్ణయం మార్చి 17వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. చర్లపల్లి నుంచి బయల్దేరే ఈ రైలు ఉదయం 08:40 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు మధ్యాహ్నం 15:35 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.

ఈ ట్రైన్ కాజీపేట, వరంగల్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, భువనేశ్వర్, ఖరగ్ పూర్ మీదుగా ప్రయాణిస్తుంది. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా. ఈ ట్రైన్ ఇకపై ఒడిశాలోని...