భారతదేశం, అక్టోబర్ 10 -- Charlapalli Tirupati Special Trains : దసరా పండగ వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులు, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి తిరుపతి మధ్య పండగ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు మరియు రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. కోచ్‌ల సమాచారం:

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచారు. పండగ వేళ ప్రయాణించే వారు ఐఆర్‌సిటిసి (IRCTC) వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Published by HT ...