చర్లపల్లి - అరుణాచలం ప్రత్యేక రైళ్లు పొడిగింపు... విజయవాడ మీదుగా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్
భారతదేశం, నవంబర్ 28 -- ప్రయాణికుల సౌకర్యం కోసం, రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. చర్లపల్లి, సంత్రాగచ్చి, తిరువణ్ణామలై(అరుణాచలం) మధ్య నడిచే ఈ స్పెషల్ రైళ్లు 2026 డిసెంబర్, 2027 జనవరిలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. పండుగలు, రద్దీ సీజన్లలో సొంతూళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఊరటనిస్తుంది.
ఈ పొడిగించిన ప్రత్యేక రైళ్ల సేవలను ప్రయాణికులంతా సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకుని సౌకర్యవంతంగా రాకపోకలు సాగించాలని సూచించింది.
ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు.. మరికొన్ని ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.