భారతదేశం, జూన్ 12 -- రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. తిరుపతి, కాట్పాడి సెక్షన్ల మధ్య ట్రాక్ ఆధునికీకరణ, సాంకేతిక నిర్వహణ పనుల్లో భాగంగా పీక్యూఆర్ఎస్ (PQRS) బ్లాకులను విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 19, 2026 నుంచి జూలై 13, 2026 వరకు ప్రతి శుక్రవారం, సోమవారం ఈ సెక్షన్‌లో ప్రత్యేక రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఇందులో భాగంగా చర్లపల్లి నుండి తిరువణ్ణామలై(అరుణాచలం) వెళ్లే ప్రత్యేక రైలును వేరే రూట్‌లోకి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం.. చర్లపల్లి - తిరువణ్ణామలై(ట్రైన్ నంబర్ 07001) ప్రత్యేక రైలును దారి మళ్లిస్తారు. నిర్ణీత తేదీల్లో గతంలో నిర్ణయించిన మార్గానికి బదులుగా రేణిగుంట, మేల్పాక్కం క్యాబిన్, కాట్పాడి మీదుగా ప్రయాణిస్తుంది.జూన...