భారతదేశం, నవంబర్ 20 -- అయ్యప్ప భక్తులు, శ్రీ సత్యసాయి బాబా భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు శబరిమల మకరవిళక్కు, మండల పూజల సీజన్ రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి - కొల్లం మధ్య అదనపు ప్రత్యేక రైలు సర్వీసును ప్రకటించింది. మరోవైపు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ మీదుగా పలు రైళ్ల మళ్లింపుతో పాటు తాత్కాలిక హాల్ట్ సదుపాయాన్ని కల్పించింది.

శబరిమల యాత్రికుల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి - కొల్లం - చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. 07185 చర్లపల్లి - కొల్లం రైలు 22.11.2026 ఆదివారం రాత్రి 11:45కి బయల్దేరుతుంది. మంగళవారం ఉదయం 7:55...