భారతదేశం, మార్చి 20 -- అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. ఈ క్రమంలో గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌ను చల్లబరిచేందుకు అమెరికా తన పాత పంథాను వీడి ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. ఇరాన్‌పై దశాబ్దాలుగా విధిస్తున్న ఆంక్షల విషయంలో వాషింగ్టన్ ఒక వ్యూహాత్మక 'యూ-టర్న్' తీసుకోనుంది. ప్రస్తుతం సముద్రంలో ట్యాంకర్లలో చిక్కుకుపోయిన ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలను ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా స్పష్టం చేసింది.

అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ గురువారం నాడు ఈ కీలక పరిణామాన్ని వెల్లడించారు. అంతర్జాతీయంగా సరఫరా కొరతను అధిగమించేందుకు, ధరల ఒత్తిడిని తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

"రాబోయే రోజుల్లో సముద్రంలో ఉన్న ఇరాన్ చమురుపై మేము ఆంక్షలు ఎత్తివేసే అవకాశం ఉంది. ఇది దాదాపు 140...