చమురు ధరల సలసల.. చల్లబడ్డ బంగారం, వెండి ధరలు
భారతదేశం, ఆగస్టు 19 -- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు (క్రూడాయిల్) ధరలు మళ్లీ భగ్గుమనడం బంగారం, వెండి మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి పెంచింది. వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరింత పెంచవచ్చనే అంచనాలు వెలువడటంతో బుధవారం ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో పసిడి, వెండి ధరలు క్షీణించాయి. అయితే, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ స్వల్పంగా తగ్గడం వల్ల బంగారం ధరల్లో మరింత భారీ పతనం తప్పింది.
ఉదయం 9:35 గంటల సమయంలో ఎంసీఎక్స్ అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.13 శాతం తగ్గి 10 గ్రాములకు Rs.1,54,055 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఇక సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 1.21 శాతం నష్టపోయి కిలో Rs.2,29,600కి పరిమితమయ్యాయి.
ఇదే సమయంలో అంతర్జాతీయ మారకం మార్కెట్లో డాలర్ ఇండెక్స్ గత సెషన్లో ఉన్న 99.66 నుంచి 99.57కి స్వల్పంగా తగ్గింది. డాలర్ విలువ స్వల్పంగా క్షీణి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.