భారతదేశం, ఆగస్టు 20 -- పండుగల సీజన్ దగ్గరపడుతున్న వేళ దేశీయంగా పంచదార ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార వ్యాపారుల వద్ద ఉండే నిల్వలపై కఠిన పరిమితులను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే ఆగస్టు 20న స్టాక్ మార్కెట్లో చక్కెర కంపెనీల షేర్లు భారీగా పుంజుకున్నాయి. ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్ షేరు అత్యధికంగా 6.3 శాతం లాభపడగా, ధాంపూర్ షుగర్ 6 శాతం, బజాజ్ హిందుస్థాన్ 5.3 శాతం, శ్రీ రేణుకా షుగర్స్ 4 శాతం, బలరాంపూర్ చిని మిల్స్ 3 శాతం వరకు లాభాలతో రాణించాయి.

ప్రభుత్వం సవరించిన నూతన నిబంధనల ప్రకారం, నెలకు 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పంచదారను కొనుగోలు చేసే డీలర్లు తమ వద్ద గరిష్టంగా 15 రోజులకు సరిపడా సరుకును మాత్రమే నిల్వ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త పరిమితులు సెప్టెంబ...