Andhrapradesh,tirumala, ఆగస్టు 26 -- చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఆరోజు సాయంత్రం 3.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8వ తారీఖు 3 గంటల వరకు ఆలయాన్ని సుమారు 12గం పాటు మూసివేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8న సోమవారం వేకువజామున 1.31 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
సెప్టంబర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునః ప్రారంభవుతుంది.
చంద్రగ్రహణం కారణంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.