భారతదేశం, జూన్ 24 -- హైదరాబాద్ మహానగరంలో గుండెల్ని పిండేసే ఉదంతం వెలుగులోకి వచ్చింది. నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ఉమెన్స్ హాస్టల్‌లో ఓ యువతి బిడ్డను ప్రసవించింది. ఆపై నవజాత శిశువును వెంటిలేటర్ గుండా బయటకు విసిరేసి ప్రాణాలు తీసింది. సమాజంలో నైతిక విలువల పతనాన్ని ఈ సంఘటన ప్రతిబింబిస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం.. సదరు యువతి గోల్కొండ పరిధిలోని ఒక హాస్టల్‌లో నివాసముంటోంది. అయితే ఆమె గర్భం దాల్చిన విషయాన్ని హాస్టల్ నిర్వాహకులు గానీ, తోటి రూమ్‌మేట్స్ గానీ గమనించలేకపోయారు. తీవ్రమైన ప్రసవ వేదన రావడంతో సదరు యువతి హాస్టల్ వాష్‌రూమ్‌కు వెళ్లింది. అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది.

ఎవరికి ఏం సమాధానం చెప్పాలనే భయమో, లేక చేసిన తప్పు బయటపడుతుందనే ఆందోళనో గానీ.. పురిటి నొప్పుల బాధలో ఉంటూనే.. అప్పుడే పుట్టిన పసికందును వాష్‌రూమ్ వెంటిలేటర్...