భారతదేశం, సెప్టెంబర్ 9 -- తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాల మీద హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పదమైన గ్రూప్ 1 పరీక్షా అంశంపై తీర్పును ఇచ్చింది. మార్చి 10వ తేదీన ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను హైకోర్టు రద్దు చేసింది.

సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తుచేసింది న్యాయస్థానం. ఆ మార్గదర్శకాల ప్రకారం పున:మూల్యాంకనం జరపాలని ఆదేశాలు ఇచ్చింది. లేని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది.

గ్రూప్ 1 పరీక్ష వివాదస్పదమైన విషయం తెలిసిందే. గ్రూప్ 1 మూల్యాంకనం అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. పరీక్షలు రద్దు చేయాలని కొందరు, ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయకూడదు అంటూ మరికొందరు హైకోర్టుల వేర్వే...