భారతదేశం, జూన్ 11 -- ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కలకలం రేపిన ఒక పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నకూతురు వేరే వ్యక్తితో లివింగ్ రిలేషన్‌లో ఉందన్న కోపంతో, కుటుంబ పరువు పోతుందనే నెపంతో కన్నతల్లే ఆమెను దారుణంగా హతమార్చింది. ఈ ఘాతుకానికి మృతురాలి భర్త, తాత పూర్తిగా సహకరించారు. గుండెపోటుతో చనిపోయిందని నమ్మించి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు ముగించినప్పటికీ, పోలీసుల చాకచక్యంతో ఈ హంతకుల గుట్టు రట్టయింది.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సోర్లిగాం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దుంపల హరిణి (24) అనే వివాహిత తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. మృతురాలు హరిణికి 2020లో ఆమె మేనమామ అయిన దంతేశ్వరరావుతో వివాహం చేశారు. వీరికి నాలుగు ఏళ్ల కుమారుడు ఉన్నాడు. డిగ్రీ పూర్తయిన తర్వాత హరిణి గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం కోసం హైదరాబాద్ వెళ్లింది...