భారతదేశం, అక్టోబర్ 20 -- ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆర్థిక, రవాణా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక బెంగళూరు-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకెళ్తోంది. భారత్‌మాల పరియోజనా ఫేజ్-2 కింద రూపుదిద్దుకుంటున్న ఈ 6 లైన్ల ప్రాజెక్ట్. యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా అందుబాటులోకి రానుంది. కొత్తగా నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారితో పాటు ప్రస్తుతం ఉన్న పలు కీలక రహదారులను ఆధునీకరిస్తూ ఈ విస్తృత కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం బెంగళూరు నుంచి విజయవాడ చేరుకోవడానికి సుమారు 11 నుంచి 12 గంటల సమయం పడుతోంది. అయితే ఈ నూతన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గి, కేవలం 6 ను...