భారతదేశం, మే 30 -- అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది వలసదారులకు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద ఊరట లభించింది. గ్రీన్ కార్డ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు దరఖాస్తుదారులు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లాలంటూ గత వారం వెలువడిన ఆదేశాలపై అమెరికా ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఈ నిబంధన అందరికీ వర్తించదని, కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వర్తిస్తుందని 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ' (DHS) స్పష్టం చేసింది.

గత వారం యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రతినిధి జాక్ కాహ్లర్ ఒక ప్రకటన చేస్తూ.. "ఇకపై గ్రీన్ కార్డ్ కోరుకునే వారు అసాధారణ పరిస్థితుల్లో తప్ప, మిగిలిన వారంతా తమ స్వదేశాలకు వెళ్లి అక్కడి నుంచే దరఖాస్తు చేసుకోవాలి" అని పేర్కొన్నారు. వలస నిబంధనలను కఠినతరం చేసే క్రమంలో భాగంగా ఈ ...